హైడ్రా పేరుతో వసూళ్ల దందా: కేటీఆర్ 1 y ago
TG: హైడ్రా పనితీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'X' వేదికగా స్పందించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని.. ఫార్మా సిటీ పేరుతో భూములను చెరబట్టారని దుయ్యబట్టారు. మరోవైపు ఫోర్త్ సిటీ సాకుతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టిందని ఆరోపణలు గుప్పించారు.